- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఉగ్రవాదుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.. పక్కా ప్రణాళికతో భారీ కుట్ర
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఉగ్రవాదుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్రణాళికలతో భారీ ఎత్తున విద్వంసం సృష్టించడానికి మూడంచెల ప్రణాళికతో కుట్ర పన్నారు. ఇందుకోసం హిజ్బ్ ఉత్ తహరీర్.. యువతను ఆకర్షించేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. మతమార్పిడి, ఉగ్ర భావజాలం ఛానల్‌లో ఇప్పటి వరకు మొత్తం 33 వీడియోలు అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలలో ప్రసంగిస్తున్న మహిళ నిందితుల్లో ఒకరి భార్యగా తేల్చారు. ఉగ్ర కుట్ర వ్యవహారాన్ని మొత్తం మహ్మద్ సలీం అలియాస్.. సౌరభ్‌రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఇతను ఓ కళాశాలలో విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా తనతో ఉన్న వారికి తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఈ ఉగ్రకుట్రలో ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో కలిసి.. రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read More: ముస్లిములుగా మారింది ఎందరు.. ఉగ్ర కేసులో రంగంలోకి ఎన్ఐఏ?