బ్రేకింగ్: ఆ స్థానంలో KCR ఓటమి..! ఆరామస్తాన్ ఎగ్జిట్స్ పోల్స్‌లో షాకింగ్ రిజల్ట్

by Satheesh |   ( Updated:2023-11-30 12:48:17.0  )
బ్రేకింగ్: ఆ స్థానంలో KCR ఓటమి..! ఆరామస్తాన్ ఎగ్జిట్స్ పోల్స్‌లో షాకింగ్ రిజల్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో తెలంగాణతో పాటు ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట పోల్స్ విడుదల రిలీజ్ అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని పలు మీడియా చానెల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆరామస్తాన్ సర్వే వెల్లడించింది. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సారి బరిలోకి దిగిన కామారెడ్డి నియోజకవర్గంపై ఆరామస్తాన్ సంస్థ షాకింగ్ ఫలితాన్ని వెల్లడించింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోతారని.. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఆరామస్తాన్ ఎగ్గిట్స్ పోల్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed