Maoist Somaiya surrender : sమావోయిస్టు పార్టీకి షాక్..అగ్రనేత మత్య్స సోమయ్య లొంగుబాటు

by Y. Venkata Narasimha Reddy |
Maoist Somaiya surrender : sమావోయిస్టు పార్టీకి షాక్..అగ్రనేత మత్య్స సోమయ్య లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు పార్టీ(Maoist Party) విప్లవోద్యమానికి కీలక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మత్య్స సోమయ్య(Matysa Somaiya) అలియాస్ సురేందర్, సతీష్ పోలీసులకు లొంగిపోయా(Surrendered)రు. 22ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న సోమయ్య 62ఏండ్ల వయసులో అనారోగ్య కారణాలతో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కరే(SP Kiran Kare) ముందు లొంగిపోయారు. ఉమ్మడి జిల్లాలో వరుస ఎన్ కౌంటర్లతో ఢీలా పడిన మావోయిస్టు పార్టీకి సోమయ్య లొంగుబాటు మరింత షాక్ నిచ్చింది.

మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సోమయ్యపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంబాపూర్ కు చెందిన సోమయ్య 1990లో పీపుల్స్ వార్ లో చేరారు. రెండేళ్లకు పోలీసులు అరెస్ట్ చేయగా..మళ్లీ 1993లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం డీసీఎస్, సౌత్ బస్తర్ వ్యవసాయ విభాగం ఇంచార్జిగా సోమయ్య పనిచేస్తున్నారు. ఇటీవలే సోమయ్య భార్య కూడా లొంగిపోవడం గమనార్హం.

Next Story