అసలు తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా..? శివసేన స్టేట్ చీఫ్ సింకారు శివాజీ ఫైర్

by Satheesh |   ( Updated:2023-09-08 14:36:16.0  )
అసలు తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా..? శివసేన స్టేట్ చీఫ్ సింకారు శివాజీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హోంగార్డ్ రవీందర్‌ అగ్నికి ఆహుతై మరణించడం బాధాకరమని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆయన కోరారు. శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్స్ కంటే ఎక్కువగా హోంగార్డ్స్ పని చేస్తున్నారని.. నానా చాకిరి చేసే హోంగార్డ్స్ సమస్యలు పరిష్కారం చెయ్యలేని దద్దమ్మ ప్రభుత్వమంటు ఘాటుగా స్పందించారు. ఇప్పటికీ హోంగార్డ్స్ ఉద్యోగులకు కనీసం ఆరోగ్య భద్రత కూడా లేకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన శాఖలో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడితే కనీసం హోంమంత్రి వెళ్లి ఎందుకు పరామర్శించలేదని.. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా.. లేడా అని ఫైర్ అయ్యారు. హోంశాఖ మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. హోంగార్డ్స్ సమస్యల పరిష్కారం కోసం చేసే న్యాయ పోరాటానికి శివసేన సంపూర్ణ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్స్‌ను ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హోంగార్డ్ రవీందర్‌ ఆత్మ హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed