పండుగపూట నల్లగొండలో ఘోరం.. ఏడుగురు దుర్మరణం

by GSrikanth |
పండుగపూట నల్లగొండలో ఘోరం.. ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా పార్వతీపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ ముందు వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కేశవులు, గణ్యా, నాగరాజు, పాండ్యా, బుజ్జి‌లుగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అందరూ పెద్దవూర మండలం మల్యవానికుంటతండా వాసులుగా నిర్ధారించారు. మరోవైపు నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపాలేంలో ఓ బైకర్ పాదచారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పాదాచారితో పాటు బైకర్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story