కర్ణాటక ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి..

by Kalyani |   ( Updated:2023-03-17 13:52:14.0  )
కర్ణాటక ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి..
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: రాబోయే కర్ణాటక శాసనసభ సాధారణ ఎన్నికలు-2023 ను దృష్టిలో పెట్టుకొని సరిహద్దు చెక్ పోస్టులను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష అన్నారు. శుక్రవారం గూగుల్ మెట్ ద్వారా కర్ణాటక లోని యాద్గీర్ జిల్లా, నారాయణపేట జిల్లా కలెక్టర్, ఎస్పీల ఇంటర్ స్టేట్ బోర్డర్ సమావేశం నిర్వహించగా వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. యాద్గీర్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ ఆర్. స్నేహ, జిల్లా ఎస్పీ సీబీ వేదమూర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇరు రాష్టాల మధ్య చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి జిల్లాల పరిసరాలలో జరిగే మద్యం అక్రమ రవాణ, రోడ్డు ప్రమాదాలు, ఇంటర్ స్టేట్ దొంగ ముఠాలు, అక్రమంగా గుట్కా రవాణా, పీడీఎస్ రైస్, ఇసుక మాఫియా, చైన్ స్నాచింగ్ ముఠాలను అరికట్టడంపై చర్చించారు. ఇంటర్ బోర్డు చెక్ పోస్టులను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సందర్భంగా నారాయణపేట జిల్లా లో బంగారం, చీరలు కర్ణాటకకు అధిక మొత్తంలో రవాణా చేసినట్టు గుర్తిస్తే తమకు తెలపాలని యాద్గిర్ జిల్లా కలెక్టర్ కోరారు.

నారాయణపేట జిల్లాకు క్రిష్ణ జలాల్ పూర్, కాన్కుర్తి, ఎక్లాస్పూర్ బోర్డర్ చెక్ పోస్టు లు ఏర్పాటుపై జిల్లా పోలీస్ అధికారులు చర్చించారు. ఇంటర్ స్టేట్ బోర్డర్ అధికారులు సంయుక్తంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని సమాచారం ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న వాట్సాప్ లో సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed