ప్రజలకు సేవ చేయడం శవానికి సేవచేయడం లాంటిదే.. ఓటమిపై బూరనర్సయ్య గౌడ్ సంచలన ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-06-07 11:28:53.0  )
ప్రజలకు సేవ చేయడం శవానికి సేవచేయడం లాంటిదే.. ఓటమిపై బూరనర్సయ్య గౌడ్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ఓటమి రామమందిరం కోసం ప్రాణాలిచ్చిన వారిని అవమానించడమేనని, ప్రజలకు సేవ చేయడం శవానికి సేవచేయడం లాంటిదని మాజీ ఎంపీ, భువనగిరి బీజేపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. స్టార్ బాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ట్వీట్ పై స్పందించిన ఆయన తన ఓటమిపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందు ఓటర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. నేను అభివృద్దిలో ఉన్న నా మెడికల్ ప్రాక్టిస్ ను వదిలి రాజకీయాలను ఎంచుకుంటానని, ప్రజల ప్రశంసల కోసం కాకుండా.. దేశ సేవలో సంతృప్తి చెందడానికి సేవ చేస్తానని నా స్నేహితులకు నిరంతరం చెప్పే వాడినని అన్నారు. నేనే నా భువనగిరి నియోజకవర్గంలో ఎయిమ్స్ లాంటి ఇనిస్టిట్యూట్ తో సహా 900 కోట్ల అభివృద్ది పనులు చేశాను. కానీ ఓటర్లు, ఓటకు కేవలం 500 తీసుకొని నన్ను ఓడించారని తెలిపారు.

ఈ ఓటమి రామమందిరం కోసం ప్రాణాలు అర్పించిన వారిని అవమానించడేమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 'ప్రజలకు సేవ చేయడం అంటే శవానికి సేవ చేయడం లాంటింది' అని తెలుగులో ఓ సామెత ఉందని బూర నర్సయ్య అన్నారు. కాగా అయోధ్యలో ఓ యువకుడు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాదవీలత పోస్ట్ చేస్తూ.. ఈ సోదరుడి కన్నీళ్లు వృధాగా పోవు అని ట్వీట్ చేసింది. దీనిపై బాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చాలా దు:ఖంతో ఉండి మాట్లాడుతున్నారని స్పంందించింది. సైనా ట్వీట్ పై బూర నర్సయ్య పై విధంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీ ఓటమి ఆశ్యర్యాన్ని కల్గిస్తుంది అని, మీరు సహనాన్ని కోల్పోవద్దు. మళ్లీ ప్రయత్నించి మంచి ఫలితాలు సాధించాలి సార్ అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed