- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
దిశ, పోతంగల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన జబ్బర్(32), దినేష్(24), సాయిగొండా అనే ముగ్గురు వ్యక్తులు అర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో పోతంగల్ నుండి కోటగిరి వైపుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు.
కరమ్ ఇండస్ట్రీ వద్ద కోటగిరి నుంచి పోతంగల్ వైపుగా వెళుతున్న బోధన్ డిపో ఆర్టీసీ బస్సు కిందకు బైక్ దూసుకెళ్లడంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. ఒకరికికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన సాయిగొండా పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు 108కి సమచారం అందించారు. క్షతగాత్రున్ని హుటాహుటిన బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
- Tags
- nizamabad