బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్.. మరో సంచలన విషయాన్ని కనుగొన్న సిట్

by Satheesh |
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్.. మరో సంచలన విషయాన్ని కనుగొన్న సిట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. ఏఈఈ పరీక్షలో ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఎగ్జామ్ రాసినట్లు తాజాగా గుర్తించింది. ప్రశాంత్, నవీన్, మహేష్‌ అనే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఉపయోగించి ఏఈఈ పరీక్ష రాశారని అధికారులు తెలిపారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ముగ్గురు వరంగల్‌కు చెందిన డీఈ రమేష్ నుండి ఏఈఈ పరీక్ష పేపర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సిట్ ఇప్పటికే డీఈ రమేష్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస అరెస్ట్‌లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌ల రోజురోజుకు పెరిగిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed