ముఖ్యమంత్రి కావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి: ఉత్తమ్

by GSrikanth |
ముఖ్యమంత్రి కావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి: ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి పదవిపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో మాట బయపెట్టారు. మంగళవారం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. తాను మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నానని.. ఇప్పటికే నా అభిప్రాయం కూడా అధిష్టానికి చెప్పానని వెల్లడించారు. ఆశిస్తున్న వారిలోనే కాదు.. రేసులో నేనూ ఉంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాననీ చెప్పారు. సీఎం ఎంపికలో ప్రజాస్వామ్య పద్దతిని అవలంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో ఎక్కడా గందరగోళం లేదని.. అందరి నిర్ణయాలు హైకమాండ్‌కు క్లియర్‌గా చెప్పామని తెలిపారు. కాగా, తెలంగాణలో విజయం సాధించినా సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్‌ ఇంకా తేల్చుకోలేకపోతోంది. తాజాగా.. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరుగుతున్న సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.

Advertisement

Next Story