- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే తెలంగాణ సీఎం: MP కోమటిరెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వద్ద మాట్లాడుతామని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీలో సమిష్టి నిర్ణయాలే ఫైనల్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష సభ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులకు కేసీఆర్ చేసిందేమి లేదని విగ్రహాలు పెడితే దళితులకు అండగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్‌లో మాదిగలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీశారు. మా పార్టీ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం కల్పించామన్నారు. బడుగు వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కితేనే మేలు జరుగుతుందన్నారు. తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని, తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యం అన్నారు.
రేవంత్‌కు షాకిచ్చేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు:
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని కోమటిరెడ్డి చేస్తున్న ప్రతిపాదన రేవంత్ రెడ్డికి షాకిచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి కాంగ్రెస్‌లో పొసగడం లేదు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకూ తారాస్థాయి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లేందుకే కోమటిరెడ్డి దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదనను తెరపైకి తీసుకువస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి వెంకట్ రెడ్డి ప్రతిపాదనపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠగా మారింది.