అందుకే నాపై CBI దాడులు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..

by Satheesh |   ( Updated:2022-12-12 12:42:47.0  )
అందుకే నాపై CBI దాడులు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని.. ఇందులో భాగంగానే తనపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాను దర్యాప్తు సంస్థల దాడులకు భయపడనని తేల్చి చెప్పారు. దాడులతో సమయం అంతా వృథా చేస్తున్నారని.. మిగిలిన సమయంలో రెట్టింపు పని చేసి వారికి మనం సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్ని దాడులు జరిగిన బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుండి వచ్చేది నీళ్లు కాదు నిప్పులు అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తారిస్తామని తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత అన్నారు.

Also Read: దేశాన్ని ఏకం చేస్తాం: బీజేపీపై MLC కవిత ఫైర్

Advertisement

Next Story