T Congress: కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక ఎమర్జెన్సీ పేరుతో కుట్ర రాజకీయాలు.. నిరంజన్ ఫైర్

by Prasad Jukanti |
T Congress: కాంగ్రెస్ ను నేరుగా  ఎదుర్కోలేక ఎమర్జెన్సీ పేరుతో కుట్ర రాజకీయాలు.. నిరంజన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కొనే సత్తా లేక ఎమర్జెన్సీ సాకుతో బీజేపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అందులో భాగంగానే కంగనా రనౌత్ ను పెట్టి ఇందిరా గాంధీపై సినిమా తీస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన నెహ్రూ కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, గాంధీ ఇజానికి, నెహ్రూ ఆదర్శ పాలనకు వ్యతిరేకంగా సో కాల్డ్ సోషలిస్టు పేర్లతో కొంత మంది కూటమిగా ఏర్పడి జయప్రకాశ్ నారాయణ్ ను ముందు పెట్టి వాళ్ల ఎజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేశారన్నారు. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని బలహీన పరిచే కుట్రలు చేశారని, 1971 బంగ్లాదేశ్ విషయంలో గొప్ప విజయం సాధించి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఇందిరాగాంధీని బలహీన పరిచేందుకు వారు చేయని కుట్రలు లేవన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక ఎమర్జెన్సీలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో ఆందోళన పుట్టించేలా వారిని రెచ్చగొట్టేలా ఎమర్జెన్సీ వంటి చిత్రాలను బీజేపీ తీసుకువస్తున్నదని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ప్రయత్నాలను దానికి కారకులు వారి బాధ్యతను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు కానీ ఆ సమయంలో తాను ప్రధాన మంత్రిగా ఉన్నందువల్ల ఆ బాధ్యతను నా తలమీద పెట్టుకున్నానని మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో ఇందిరా గాంధీ చెప్పారన్నారు.

Advertisement

Next Story

Most Viewed