- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వారికి ప్రాధాన్యత ఇవ్వాలని మూకుమ్మడి డిమాండ్!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి రాగానే, నేతలంతా పదవుల కోసం ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా కేబినెట్ ర్యాంకుతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులకు డిమాండ్ పెరిగింది. పదవులు ఆశిస్తున్నోళ్లంతా సీఎం, మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ప్రతి రోజూ సచివాలయంలో మంత్రులను కలుస్తూ రిక్వెస్టు చేస్తున్నారు. గాంధీభవన్‌లోనూ ఆయా నేతలు, తమకు పదవులు ఇవ్వాలని ముఖ్య నాయకులకు అర్జీ పెట్టుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పదవులను జనవరి సెకండ్ వీక్‌లో భర్తీ చేసే అవకాశముంది.
వీటిలోనూ ఈక్వెషన్సే?
కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి మంత్రివర్గ కూర్పు వరకు కుల, సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదే విధానంలో ఎమ్మెల్సీ ఎంపికతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను సెలక్ట్ చేస్తామని సీఎంకు అతి సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. కార్పొరేషన్ల పదవులను దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు యంగ్ లీడర్లూ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో బీసీలకు కొంత అన్యాయం జరిగిందని పార్టీలోని కొందరు నేతలే విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఆ లోటును కార్పొరేషన్ చైర్మన్ పదవులతో తీరుస్తారా? అన్న చర్చ జరుగుతున్నది. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. 54 కార్పొరేషన్లకు 200 మంది కీలక నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
టిక్కెట్ల కోసం 1006 అప్లికేషన్లు?
ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం గతంలో గాంధీభవన్‌లో 1006 మంది అప్లై చేశారు. ఆయా పేర్ల నుంచి ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు పలు దఫాలుగా ఫిల్టర్ చేసి 119 సెగ్మెంట్లకు ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలో అసంతృప్తులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ భరోసా ఇచ్చింది. దీంతో కొందరు పార్టీ కోసం పనిచేయగా, మరికొందరు పార్టీ మారారు. టికెట్ రాకున్నా ఎమ్మెల్యేల విజయం కోసం కృషి చేశామని, నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించేలా చొరవ చూపాలని గెలిచినవారిపై ప్రెషర్ పెడుతున్నట్లు సమాచారం.
గాంధీభవన్‌లో కీ రోల్..?
కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌లో కీలక నేతలుగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య, మైనార్టీ సెల్ చైర్మన్‌తో పాటు గాంధీభవన్‌లో నిత్యం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో దాదాపు వంద మంది నేతలు నిబద్ధతో పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడటంతో నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం కల్పించాల్సిందేనంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారు.