- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పని పరిస్థితుల్లో చేర్చుకుంటున్నాం.. కాంగ్రెస్‌లో చేరికలపై అద్దంకి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో చేరికలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నామని అన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తి నేతలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులు తెలంగాణలోనే కాదని.. దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. కేవలం కేసీఆర్ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రాజకీయాల్లో బీఆర్ఎస్‌కో న్యాయం.. కాంగ్రెస్‌కో న్యాయమా? అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు చేరికకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు.