WEED : వామ్మో.. ఇదెక్కడి ట్వీస్ట్! పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు..

by Ramesh N |   ( Updated:2024-09-09 13:17:08.0  )
WEED : వామ్మో.. ఇదెక్కడి ట్వీస్ట్! పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్, గంజాయి పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం తెలంగాణ పోలీస్ ఫోకస్ పెంచింది. ముఖ్యంగా గంజాయి ఎక్కడ పట్టుబడిన.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో ఆ పరిధిలో అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గంజాయిని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. దీంతో నేరగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‌లోని దూల్‌పేటకు చెందిన నేహా బాయి అనే మహిళ పసుపు ప్యాకెట్లు తయారీ కేంద్రాన్ని పెట్టుకుంది. అయితే, పసుపు ప్యాకెట్లలో పసుపు కాకుండా గంజాయి పెట్టి అమ్ముతోంది. దీనిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు సమాచారం అందడంతో నిఘా పెట్టి దాడి చేసింది. దీంతో ఆ మహిళా అధికారులకు దొరికిపోయింది. అట్లాస్ టర్మరిక్ పౌడర్ పేరుతో ఉన్న ఆ ప్యాకెట్లను అధికారులు విప్పి చూడగా అందులో గంజాయిని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఎఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డీఎస్‌పీ తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజుతో పాటు సిబ్బంది కలిసి ఈ దాడి చేశారు. 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, నేహా బాయిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామ్మో చూడటానికి పసుపు ప్యాకెట్ల ఉన్న ఇదెక్కడి ట్విస్ట్ అంటూ పలువురు ఆశ్చర్యపోయారు.

Advertisement

Next Story

Most Viewed