- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG News : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక... వారికి షాక్ ఇవ్వనున్న AICC

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగిన సంగతి తెలిసిందే. మార్చ్ 20న జరగబోయే ఈ ఎన్నికలకు, 10వ తేదీన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి 4 స్థానాలు రానున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాల అభ్యర్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఏఐసీసీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ(Telangana AICC In-Charge Meenakshi Natarajan) నటరాజన్ తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఐ(CPI)కి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈసారి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారికి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించిన్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం అధిష్టానాన్ని మీనాక్షీ నటరాజన్ నివదిక ఇవ్వనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం రానుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కానప్పటికీ.. సత్యవతి రాథోడ్(Satyavathi Rathod), దాసోజు శ్రవణ్ (Dasoju Shravan)లను గులాబీ బాస్ డిసైడ్ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.