- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రునిపై ఉన్న బిలాలు చూయించి.. ఔరా అనిపించిన రుషికేష్..!
దిశ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బూర్ల రుషికేష్ చంద్రుడిపై ఉన్న బిలాల గురించి టెలిస్కోప్ ద్వారా వివరించి అబ్బురపరిచాడు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లా సైన్స్ అధికారి సిద్ధ రాంరెడ్డి ఆధ్వర్యంలో స్కై వాచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కుటుంబ సభ్యులతో హాజరై విద్యార్థి రుషికేశ్ వద్ద ఉన్న టెలిస్కోప్ ద్వారా బిలాల గురించి వారికి వీక్షింపజేయించి, పనితీరును తెలియజేశారు.
అంగారక గ్రహంతో పాటు, ఇతర గ్రహాల గురించి మరో టెలిస్కోప్ ద్వారా వివరించి ప్రతిభ చాటుకున్నాడు. అనుకోకుండా ఆ కార్యక్రమానికి హాజరైన విప్ గంప గోవర్ధన్ బూర్ల రుషికేష్ ప్రతిభను చూసి వెల్డన్ మై చిల్డ్రన్ అంటూ ప్రశంసించారు. చిరుప్రాయంలోనే తన టాలెంట్‌తో ఆకాశంలో నెలకొన్న అద్భుతాల గురించి వివరించడం పట్ల సంభ్రమశ్చార్యంలో మునిగిపోయారు. అనంతరం రుషికేష్‌ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ ఉపాధ్యాయులు పృథ్వీరాజ్, తమ్మలి రాజు, జగన్, శ్రీనివాస్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.