- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోవా వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ టు గోవా రైలు
దిశ, తెలంగాణ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రలైన తెలంగాణ, ఏపీ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన గోవా వెళ్లేందుకు ఇక నుండి మార్గం సుగమం కానుంది . గోవా టూర్ కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలు సేవలను అందుబాటులోకి తేనుంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలు సర్వీసు పట్టాలెక్కబోతోంది. ఈ రైలు వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త రైలు బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు , గురు, శనివారాల్లో అటు నుంచి సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి వస్తోంది. టిక్కెట్ ధరలను త్వరలో వెల్లడిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం గోవా వెళ్లే వారి కోసం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్లు చేరుకుంటుంది. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి మరో రైలు గా మారి గోవాకు వెళుతుంది. అలాగే కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ నాలుగు కోచ్‌లనుగుంతకల్ దగ్గర షాలిమార్ - గోవా రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి రిక్వెస్ట్ చేయడంతో ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో ఈ రైలు సర్వీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళుతుంటారు. వీరిలో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచి నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో గోవాకు వెళుతుంటారు. అందుకే సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలును తీసుకొచ్చారు.