- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్రటేరియట్ వైపు ర్యాలీగా వెళుతున్న మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీలలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లారు. నినాదాలు చేస్తూ.. వెళుతున్న సర్పంచులను పోలీసులు అడ్డగించారు. నిరసన కారులు పోలీసులను తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కొందరు సర్పంచులు పోలీసులను దాటుకొని సచివాలయం వద్దకు చేరుకోగా.. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిరసనలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని, గాందేయ మార్గంలో తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుతగిలి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
ఈ సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. 2019- 24 మధ్య పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వడ్డీలకు రుణాలు తెచ్చి గ్రామాల్లో అభివృద్ది పనులు చేశామని, ఆ అప్పుల బాధలు తాళలేక ఇప్పటికే కొందరు సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని అన్నారు. అలాగే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే.. నిరసనను తీవ్రతరం చేస్తామని యాదయ్య హెచ్చరించారు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో.. ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వివిధ జిల్లాల, మండలాల సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.