Earthquake: భూకంపంపై సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Gantepaka Srikanth |
Earthquake: భూకంపంపై సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలను భూకంపం(Earthquake) భయబ్రాంతులకు గురిచేసింది. బుధవారం ఉదయం సడన్‌గా భూమి కంపించడంతో అంతా ఆందోళన చెందారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలుచోట్ల రెండు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. ములుగు(Mulugu) జిల్లా మేడారం(Medaram) కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయ్యింది. ఇలాంటి భూకంపం రావడం తెలంగాణలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో భూకంపంపై ఎన్‌జీఆర్ఐ(NGRI) అధికారి డాక్టర్ శేఖర్(Scientist Shekhar) స్పందించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. మరోసారి భూమి కంపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది వీడియోలో ఆయన ద్వారానే తెలుసుకుందాం.


Advertisement

Next Story

Most Viewed