- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలి.. మంత్రి నిరంజన్ రెడ్డికి వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్న 22,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ అమలు, శాశ్వత ప్రాతిపదికన నియమించాలని మంత్రులను కోరినట్టు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోయ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లకు వినతి పత్రం సమర్పించామని అయన తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు స్వరూప రాణి, ముఖ్య సలహాదారులు ప్రవీణ్ కుమార్ కార్యనిర్వాహక అధ్యక్షులు విజయాచారి, రాష్ట్ర బాధ్యులు రాఘవేంద్ర నాయుడు, చంద్రశేఖర్, సాయికుమార్, హైదరాబాద్ అధ్యక్షులు పాషా మరియు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.