రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సర్పంచ్, జిల్లా అధికారులు

by Kalyani |
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సర్పంచ్, జిల్లా అధికారులు
X

దిశ, మహబూబ్ నగర్: జాతీయస్థాయిలో 100% సామాజిక భద్రతను సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామ సర్పంచ్ మానస అవార్డు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు, డీపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులతో కలిసి సర్పంచ్ మానస ప్రశంసాపత్రం, కోటి రూపాయల నజరానాను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రజా ప్రతినిధులు, అధికారులకు శుభాభినందనలు తెలిపారు. ఈ అవార్డు స్ఫూర్తితో జిల్లాలోని గ్రామపంచాయతీలను మరింత అభివృద్ధి చేసేందుకు సర్పంచులు, అధికారులు కృషి చేయాలని వారు కోరారు.

Advertisement

Next Story