- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థి జనసమితి అధ్యక్షుడిగా సర్దార్ వినోద్
దిశ, తెలంగాణ బ్యూరో: టీజేఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ వినోద్ కుమార్‌ను పార్టీ నాయకత్వ సూచన మేరకు అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం ఇంచార్జ్ ధర్మార్జున్ మంగళవారం నియమించారు. సర్దార్ వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ, సైన్స్ కాలేజీలోని వృక్షశాస్త్రం విభాగంలో పరిశోధక విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా విద్యార్థి నేతగా ఉన్న వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంతో పాటు విద్యారంగ సమస్యలపై పోరాటంలో భాగంగా పలు సార్లు అక్రమ కేసులు ఎదుర్కొని జైలు జీవితం సైతం గడిపారు.
విద్యార్థి ఉద్యమకారునిగా మొదటి నుంచి కోదండరాం వెంట నడిచారు. ఈ సందర్భంగా సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే తనకు గుర్తింపు తెచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. నా నియామకనికి సహకరించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, పార్టీ అధినేత కోదండరాంకి వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీ వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సర్దార్ వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వీరు నాయక్, ప్రశాంత్ పేరాలను నియమించారు.