- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భైంసాకు బండి సంజయ్.. ఉత్తర్వులు అందలేదంటున్న పోలీసులు
దిశ ప్రతినిధి, నిర్మల్ : బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సాయంత్రానికి బైంసాకు చేరుకోనున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లా బైంసా నుంచి ప్రారంభించనున్న ఆయన పాదయాత్రకు పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు. సున్నిత ప్రాంతంగా పేర్కొన్న పోలీసులు అల్లర్లు జరుగుతాయన్న కారణంగా ఆయన పాదయాత్రకు బ్రేకు వేశారు. అయితే బీజేపీ లీగల్ సెల్ ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ కోసం ప్రయత్నించగా అది ఫలితమివ్వలేదు. తాజాగా సోమవారం హైకోర్టును ఆశ్రయించగా కొన్ని పరిధిలకు లోబడి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొననున్నారు. రామారావు పటేల్ చేరిక కార్యక్రమాల అనంతరం పాదయాత్రను కొనసాగించనున్నారు. అయితే కోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read more: