సలేశ్వరం జాతరకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి

by Sathputhe Rajesh |
సలేశ్వరం జాతరకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అటవీ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. ముందు ప్రకటించిన మాదిరిగానే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు వరకే సలేశ్వరం జాతరకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతులు ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆలస్యంగా భక్తులు వస్తే అటవీశాఖ చర్యలకు బాధ్యత వహించాలని సూచించారు. కావున అధికారులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed