- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Runa Mafi : సెకండ్ ఫేజ్ రుణమాఫీపై కీలక అప్‌డేట్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కొటిగా నెరవేరుస్తోంది. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విధంగానే కసరత్తు చేస్తోంది. మొదటి విడత విడుదల చేసిన సర్కార్.. ఇప్పుడు రెండో విడత జాబిత విడుదలకు సిద్ధమైంది. జులై 18న రూ. లక్షల వరకు రుణమాఫీ చేసిన సర్కార్.. ఈ నెలాఖరులోకా రూ. 1.50లక్షల రుణాలు ఉన్న రైతులు ఖాతాల్లోకి వడ్డీతో సహా జమ చేయనుంది. ఆగస్టు 15వ తేదీలోగా రూ. 2లక్షల రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది.
అటు లక్షలోపు లోన్ తీసుకున్న రైతులకు చాలా మందికి మాఫీ కాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అధికారులు పలు రకాల కారణాలు చెబుతున్నారు. రేషన్‌కార్డులో ఎంత మంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాఫీ అవుతుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతుంటే.. కుటుంబంలో ఎంత మంది రుణం తీసుకున్నా వడ్డీతో సహ కలిపి రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ ఉంటుందని.. వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని మంత్రి సూచించారు. ఇక లక్షలోపు రుణం తీసుకున్నవారికి వడ్డీతో కలిపి లక్ష క్రాస్ అయినవారికి మాఫీ కాలేదు. వారికి రెండో విడతలో మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రెండో విడత జాబితా ఎప్పుడు వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నరు. మొదట విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యేవరకే రెండో జాబితాను ఫైనల్ చేసి ప్రభుత్వానికి, బ్యాంకులకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. రెండో విడత.. అర్హులైన రైతుల వివరాల లిస్ట్‌ను జులై 29న ఈ వెబ్‌సైట్లో https://clw.telangana.gov.in/Login.aspx అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.