పిల్లలపై అతి ప్రేమ వల్లే ఇలాంటి దుర్ఘటనలు.. సన్ సిటీ రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్

by Javid Pasha |
పిల్లలపై అతి ప్రేమ వల్లే ఇలాంటి దుర్ఘటనలు.. సన్ సిటీ రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం వివిధ అంశాలపై స్పందించే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా హైదరాబాద్ నగర శివారులోని సన్ సిటీ వద్ద నిన్న జరిగిన కారు ప్రమాదంపై స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరం అన్నారు. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన అతివేగం.. అమాయకులైన తల్లి కూతుర్ని పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచించారు.

పిల్లల మీద అతి ప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని హెచ్చరించారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన తల్లి కూతుళ్లపైకి 120 కి.మీ వేగంతో కారు దూసుకు వచ్చింది. 19 ఏళ్ల మహమ్మద్ బద్రుద్దీన్ ఖాదీర్ ఈ కారును నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed