- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ ఎండీకి కోపం తెప్పించిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్ వైరల్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: నేటి కాలంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే బతికేస్తోంది. లైక్‌లు, ఫాలోవర్స్ కోసం అనేక స్టంట్‌లు చేస్తున్నారు. రోడ్లుపై విచ్చలవిడిగా తిరుగుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకునే విధంగా విన్యాసాలు చేసి కెమెరాకంటికి చిక్కాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై వీసీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ వ్యక్తి.. తన ముందు వెళుతున్న బస్సుపై కాలు పెట్టాడు. అతడు స్కూటీ డ్రైవ్ చేస్తూనే బస్సుపై కాలు పెట్టడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి చేసిన పనికి కాస్త అటూ ఇటూ అయినా ప్రాణాలకే ప్రమాదం జరిగేది. కాగా.. అక్కడ జరిగిన విన్యాసాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నెటిజన్లు. అది కాస్త వైరల్ కావడంతో దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
ఈ మేరకు ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ..‘‘ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే ‘‘వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.’’ అంటూ మరో ట్వీట్ చేశారు. మరి విచాక్షణరహితంగా వ్యవహరించిన వ్యక్తిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023