వారం రోజుల్లో పల్లెల్లోకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు!.. తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-07-07 13:56:04.0  )
వారం రోజుల్లో పల్లెల్లోకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు!.. తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారం రోజుల్లో పల్లెలో ఆర్టీసీ విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజీఎస్ఆర్టీసీని బలోపేతం దిశగా కీలక అడుగులు వేస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తీవ్రంగా పెరిగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కొత్త బస్సుల సంఖ్యను పెంచింది. పెరిగిన రద్దీ దృష్యా ఆర్టీసీలో నియామకాలు చేపట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా మంజూరు అయ్యాయి.

అయితే ఈ బస్సుల పెంపులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తొలిసారి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఈ విద్యుత్ బస్సులను హైదరాబాద్ నగరంలోనే నడిపిన ఆర్టీసీ.. ఇప్పుడు పల్లెలకు సైతం తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ ఆర్టీసీకి 450 బస్సులు మంజూరు అయ్యాయని, దీంతో పల్లెల్లో విద్యుత్ తో నడిచే ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయని, వారం రోజుల్లో తొలిదశ బస్సులు ప్రారంభం అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తెలియజేశింది.

Advertisement

Next Story

Most Viewed