తెలంగాణ ఏమయినా కేసీఆర్ అయ్య జాగీరా?: RS ప్రవీణ్ కుమార్

by GSrikanth |
తెలంగాణ ఏమయినా కేసీఆర్ అయ్య జాగీరా?: RS ప్రవీణ్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం పూర్తి దు:ఖంలో ఉందని బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఎస్పీ ఆధ్వర్యలో మే 7న హైదరాబాద్ సరూర్ నగర్‌లో తెలంగాణ భరోసా సభ జరగనుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఒక అనాథ అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గోస పట్టించుకునేనాథుడు లేదన్నారు. దు:ఖంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఉపశమనం, ఓదార్పు ఇచ్చేందుకు తెలంగాణ భరోసా సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆరు రోజులుగా రోడ్లపైనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిపోయి నష్ట పరిహారం ఇవ్వండని రైతులు అడుగుతుంటే వారిని పట్టించుకున్న నాథుడే లేరని మండిపడ్డారు. మిల్లర్లు చేస్తున్న దోపిడీని అడ్డుకునే నాథుడూ కరువయ్యారన్నారు.

దళితబంధులో ఒక్కొక్క ఎమ్మెల్యే రూ.3 లక్షలు తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. ఆ అవినీతి చిట్టాను ఎందుకు సీబీఐకు ఇవ్వడంలేదని ప్రవీణ్ ప్రశ్నించారు. విద్యార్థులు స్కూళ్లు బాగులేవని ఏడుస్తున్నారని తెలిపారు. ‘యూనివర్సీటీల్లో లెక్చరర్లు లేక వాళ్లు ఏడుస్తున్నారు. ఉద్యోగులు జీతాలు లేక ఏడుస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో 36 లక్షల మంది విద్యార్థులు జీవితాలు నాశనమయ్యాయి. బాధ్యులను తీసేయమంటే సీఎం పట్టించుకోలేదు. అలాగే ప్రజల ముందుకు వచ్చి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటంలేదు. ఎంతసేపూ ముఖ్యమంత్రి పోలీసుల మధ్య ఉండి కనీసం మీడియాను కూడా దగ్గరకు రానివ్వడంలేదు.

ఇది రాజరిక పాలనా..?. లేదా తెలంగాణ ఏమయినా కేసీఆర్ అయ్య జాగీరా..?. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్‌పై నిజాలు బయటకు రావాలి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు కుమ్మక్కై పేపర్లు లీక్ చేశారు. దాని వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రుల కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉంది. వీళ్లను వదిలేసి ఊర్లలో ఎవరైతే పేపర్లు అమ్ముకున్నారో వారిపై చర్యలు తీసుకున్నారు. పేపర్ లీక్ ఘటన జరిగి ఇప్పటికి 50 రోజులైందని, అసలు సూత్రదారులను పట్టుకోలేకపోయారు. ఎవరైతే లావాదేవీలు చేశారో టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల సెల్ ఫోన్లను ఇప్పటివరకూ పరిశీలించలేదు. కాల్ డిటేల్స్ పరిశీలిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి.’ అని ఆర్ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed