- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు ఓటర్లకు RS ప్రవీణ్ కుమార్ కీలక విజ్ఞప్తి
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తు్న్నాయి. మరీ ముఖ్యంగా ఈ బైపోల్‌ను ప్రతిష్టాత్మంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే గొల్ల కురుమలకు రెండు విడతల్లో 12,970 కుటుంబాలకు లబ్ధి కల్గిందని, దాన్ని ప్రచారం చేయాలని ఆ కుల నాయకులకు మంత్రి కేటీఆర్ సూచించారు. దీనిపై బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాగుంది వందకు ఒక్కరు ఉన్నోళ్లేమో ఎప్పుడూ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ, చేనేత శాఖా మంత్రులంట!... మిగిలిన 99 మందేమో కులసంఘాల చుట్టు తిరిగి ఈ దొరలకు ఓట్లు వేయించాలంట అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, కష్టపడే మనకేమో గొర్రెలు-బర్రెలంట, వాళ్ల కేమో గద్దెలు-గడీలంట!! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని, మునుగోడు బహుజన అన్నలారా-అక్కలారా, ఒక్క సారి ఆలోచించండి అంటూ ఆరెస్పీ సూచించారు. కాగా, మునుగోడులోని గొల్ల కురుమలకు గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
బాగుంది😁 వందకు ఒక్కరు వున్నోళ్లేమో ఎప్పుడూ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ, చేనేత శాఖా మంత్రులంట! మిగిలిన 99 మందేమో కులసంఘాల చుట్టు తిరిగి ఈ దొరలకు ఓట్లు వేయించాలంట. మనకేమో గొర్రెలు-బర్రెలంట, వాళ్ల కేమో గద్దెలు-గడీలంట!! మునుగోడు బహుజన అన్నలారా-అక్కలారా, ఒక్క సారి ఆలోచించండి.🐘🐘🙏🏼 pic.twitter.com/ysBMaxc3rg
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 23, 2022