- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇఫ్తార్ విందులు కాదు.. మైనార్టీలకు ఇన్సాఫ్ ఇవ్వండి: RSP
దిశ, తెలంగాణ బ్యూరో: ఖదీర్ ఖాన్ వీడియోను మరణ వాంగ్మూలంగా తీసుకొని నిందితులపై 302 సెక్షన్ కింద అరెస్టు చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. అరటి పండ్లు అమ్ముతూ, కూలీ చేసి బతుకుతున్న ఖదీర్ ఖాన్‌ను దొంగతనం చేశాడనే నెపంతో అక్రమంగా, ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసి పోలీసులు తీవ్రంగా దాడి చేయడంతో మరణించాడని తెలిపారు. అరెస్టు చేసిన నాలుగు రోజుల వరకు కనీసం కుటుంబానికి చెప్పలేదని అన్నారు. తీవ్రంగా గాయపడిన ఖదీర్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో గుట్టుచప్పుడు కాకుండా వైద్యం అందించి, ఆ మెడికల్ రిపోర్టులను కూడా తగులబెట్టారని ఆరోపించారు.
అయినా ఇప్పటివరకు నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వందకోట్ల లిక్కర్ స్కాం చేసి, ఆధారాలు లేకుండా ఫోన్లు ధ్వంసం చేసిన కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. గతంలో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మను కూడా ఇలాగే చంపేశారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, ఇచ్చి పిల్లలను ఉచితంగా చదివించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఖదీర్ ఖాన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇఫ్తార్ విందులు కాదు, మైనారిటీలకు ఇన్సాఫ్ ఇవ్వండి చాలంటూ ఎద్దేవా చేశారు. కలిసిన వారిలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, ఇంచార్జి సాయిలు, హరిలాల్ తదితరులు ఉన్నారు.