- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కంపెనీ యాజమాన్యంతో KTR, ఎమ్మెల్యే కోనప్ప కుమ్మక్కు: RS ప్రవీణ్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోనప్పలు కుమ్మక్కైనారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రహస్య ఒప్పందంతోనే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్ (ఎస్పీఎం) కార్మికులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జేకే కంపెనీ యాజమాన్యం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనప్ప చేతిలో బందీలై కార్మికుల కష్టాలు తీర్చడం లేదన్నారు.
పేపర్ మిల్‌లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేతనాల్లో స్థానికులకు, స్థానికేతరులకు తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. ఎస్పీఎం కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందడం లేదన్న ఆయన కార్మికులకు సరైన వైద్య సేవలు కూడా అందడం లేదన్నారు. చివరకు కంపెనీలో పనిచేసే కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలో పేపర్ మిల్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ఆయన కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీలో పనిచేసే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మీకోసమే సిర్పూర్ వస్తున్న మీ బిడ్డగా ప్రజలందరూ ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. అనంతరం ఆర్ఎస్పీ కాగజ్‌నగర్ పట్టణంలో మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.