- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జీవితాలతో చెలగాటమాడుతున్నాయి: RSP
దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుండాయిజం చేస్తున్నాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలతో, బీజేపీ పార్టీ పదో తరగతి పిల్లల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మెసేజ్ రిసీవ్ చేసుకోవడం నేరం కాదు.. కుట్ర చేయడం నేరమన్నారు. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగం కావడం ఘోరమైన తప్పు.. ఘోరమైన నేరం అందుకే బండి సంజయ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ర్టంలో రాజకీయం చేసే అర్హత బీజేపీ వాళ్లకు లేదన్నారు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను, వారి తల్లి దండ్రులు పేపర్ లీకేజీ వల్ల ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని అందులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వరంగల్‌లో హిందీ పేపర్ లీక్ కావడం.. ప్రశ్నపత్రాన్ని దాదాపు రెండువందల మందికి షేర్ చేశారని అన్నారు. విచారణలో 120 ఐపీసీ కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రతో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆందోళనకు గురిచేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ ఘటనపై వరంగల్ CP రంగనాథ్‌ను అభినందిస్తున్నాను. ఇందులోనే ఇంత కుట్ర చేస్తే రాబోయే రోజుల్లో మత కలహాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బండి సంజయ్ ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో కూడా అనేక వాఖ్యలు చేశారని, బండి సంజయ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్పీ డిమాండ్ చేశారు.