పోలీసులను బూతులు తిట్టండి.. మంత్రి పదవులు కొట్టండి: R. S. Praveen Kumar

by Satheesh |   ( Updated:2023-08-25 12:48:16.0  )
పోలీసులను బూతులు తిట్టండి.. మంత్రి పదవులు కొట్టండి: R. S. Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో పట్నం మహేందర్ రెడ్డి సహనం కోల్పోయి ఓ సీఐపై వినలేని భాషలో దూషించారు. అంతటితో ఆగకుండా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన వదిలిపెట్టనని ఫోన్‌లో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మహేందర్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో లింక్‌ను బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ చేశారు.

‘పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవా? పోలీసులను బాగా బూతులు తిట్టండి. మంత్రి పదవులు కొట్టండి. ఇదే కేసీఆర్ ప్రతిభ ఆధారిత ప్రమోషన్ పాలసీ, పోలీసన్నలు, ప్రభుత్వ-ప్రైవేటు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటప్పుడు దయచేసి గుర్తుంచుకోండి. బహుజనరాజ్యంలో అందరికీ సమాన గౌరవం లభిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story