- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా బంగారు తెలంగాణ..? సీఎం కేసీఆర్‌పై RSP ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ప్రజా సమస్యలు రైతు కష్టాలు ఏ మాత్రం పట్టడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. రైతులు మిల్లర్ల చేతిలో మోసపోయి, దళారులకు చౌకగా పంట అమ్ముకొని మోసపోయేదందుకు రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వమే కుమ్మక్కయిందని ఆరోపించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు చివకు మిగిలింది ఇదేనా అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని.. ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కనుగోలు చేయాలని బీఎస్పీ తరపున డిమాండ్ చేశారు.
Read More: వరంగల్ జైల్‌ను కుదువ పెట్టిన KCR.. బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు