- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లను పట్టుకొని శిక్షించే వరకు మా పోరాటం ఆగదు: RSP
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల బాధలు, ఇబ్బందులు గాలికొదిలి అధికార, విపక్షాలు రాజకీయ విమర్శలు చేసుకొని కొంతకాలం రాష్ట్ర వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే, పేపర్ లీకేజీ కేసు నమోదై ఇప్పటికే నెల రోజులు గడిచినా నిందితులకు శిక్ష పడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆ లీకుల వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులెవరో ప్రపంచమంతటికీ తెలిసినా వారు చట్టం నుంచి రక్షణ పొందుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘టీఎస్‌పీఎస్‌సీలో ఇంటి దొంగలు ఇంకా సురక్షితంగానే ఉన్నరు. వాళ్లను పట్టుకునే దాకా తెలంగాణ పోరాటం ఆపదు.’ అని సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.
.@TSPSCofficial లో ఇంటి దొంగలు ఇంకా సురక్షితంగానే ఉన్నరు. వాళ్లను పట్టుకునే దాకా తెలంగాణ పోరాటం ఆపదు.👊 pic.twitter.com/SbUFSaKe2Y
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 22, 2023