- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
దిశ, వెబ్ డెస్క్: 2004కు ముందు ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక, పంజాబ్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ మాత్రం పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు వర్తింపచేయడం లేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2002, 2003 DSC ఉపాధ్యాయులతోపాటు Group-II, పోలీస్, జ్యూడిషరీ,హెల్త్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు ఈ ఆగస్టు 31తో ముగుస్తోందని, దీంతో స్కీమ్ ను తమకు అమలు చేస్తారో లేదో అని వేలాది మంది ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి అర్హులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.