టానిక్ షాపుల పేరుతో దోచుకున్నారు.. మీ దొంగ దందాలు బయటపెడతాం

by Ramesh Goud |   ( Updated:2024-03-06 16:21:29.0  )
టానిక్ షాపుల పేరుతో దోచుకున్నారు.. మీ దొంగ దందాలు బయటపెడతాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పాలమూరు సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్దారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని పనికిరాని నాకొడుకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లకు చెబుతున్నానని, నీ బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా చేసి దొరికిపోయిందని, మీరు ఇక్కడ టానిక్ షాపుల పేరుతో దోచుకుంటున్నారని, ధరణి పేరుతో దోచుకున్నావని, మునిగిపోయే కాళేశ్వరం కట్టావని, నీ దొంగ దందాలు బయటపెడతామని హెచ్చరించారు.

అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పారు. సోనియాగాంథీకి రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చినా.. దేశం కోసం ఆర్ధిక మంత్రిని ప్రధానిని చేశారని, రాహుల్ గాంధీ పదవులు వద్దని, ప్రజల కోసం కష్టపడే నాయకుడన్నారు. రాష్ట్రం కోసం రేయింబవళ్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా కష్టపడుతున్నారని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకో బీని కలుపుకుందని, వీరితో మరో బీ అయిన బీజేపీ కలిసినా.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 14 సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతారని, బీజేపీ కులం మతం తప్ప ఇంకేం చేయదని తెలిపారు. జీఎస్టీ పేరుతో ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిన మోడీ ఒకవైపు, తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీలు ఒకవైపు ఉన్నారని, అందుకే చెయ్యి గుర్తుకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డికి ఇంకా బలాన్ని ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story