- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుగులేని ఫలితాలతో ‘రిషి’ విజయ దుందుభి
దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్ర, జిల్లాస్థాయిలలో ర్యాంకులను సాధించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో అమూల్య, దివ్య యశోద 467 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ధరణి, అక్షయ 466, సాకేత్ సింగ్, హెప్సీబా 465 మార్కులను సాధించారు. మొత్తం 120 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు.
బైపీసీ మొదటి సంవత్సరం ఫలితాలలో కే అనన్య 437, ఆయేషా సుమయ 435,, స్నేహ ప్రియ, ఆర్ పి అమూల్య, అంకిత్ రెడ్డి 435 మార్కులు, ఫజల్ మీరజ్, ధానీయ నాజిన్, సీతల్ జోషి యాదవ్, కంచి గుప్తా, అహ్మదున్నిసాబేగం 434 మార్కులను సాధించారు. 115 మంది విద్యార్థులు ఈ విభాగంలో 400కు పైగా మార్పులను సాధించడం విశేషం. ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో డబ్ల్యూ అనుష్క 988, డి ప్రణీత, భ్రమరాంబిక , నౌసీన్ సుల్తానా 987 మార్కులను సాధించి రాష్ట్ర జిల్లా స్థాయి యాంకర్లుగా నిలిచారు.
ఈ విభాగంలో 190 మంది విద్యార్థులు 900 కు పైగా మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మైత్రి 983, జై శ్రీనివాస్ 982, కే కౌశిక్ యాదవ్ 980 మార్కులు సాధించారు. 80 మందికిపైగా ఎంపీసీ విభాగంలో 900 మార్కుల మైలురాయి దాటారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కోఆర్డినేటర్ వెంకటయ్య, చైర్మన్ చంద్రకళ వెంకట్, డీన్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.