ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

by Javid Pasha |   ( Updated:2023-07-27 14:02:40.0  )
ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న కేఎంవీ జగన్నాధరావును చౌటుప్పల్ ఆర్డీవోగా, మంచిర్యాల ఆర్డీవోగా ఉన్న బి.శకుంతలను హైదరాబాద్ జిల్లా లా ఆఫీసర్ గా, చౌటుప్పల్ ఆర్డీవో కే వెంకట ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వానికి రిపోర్టర్ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో జగన్నాధరావు మునుగోడు ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. తిరిగి అదే నియోజకవర్గంలోని డివిజన్ కి ఆర్డీవోగా రావడం గమనార్హం.

Advertisement

Next Story