- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CMగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు (గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, కర్ణాటక సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ ముఖ్య నేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణకం ఠాగూర్, చిదంబరం, మీరాకుమారికి ఆహ్వానం పంపారు. సుశీల్ కుమార్ షిందే, కురియన్ లకు ఆహ్వానం అందింది.
తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కోదండరామ్, గాదె ఇన్నయ్య, హర గోపాల్, కంచె ఐలయ్యతో పాటు అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వివిధ కులసంఘాలు, మేధావులకు ఆహ్వానం పంపారు.
Also Read...
CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..!