- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓఆర్ఆర్ లీజు టెండర్ల అంశంపై హైకోర్టుకు Revanth Reddy
X
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఓఆర్ఆర్ లీజు టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ వివరాలను తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా సంప్రదిస్తే అందుకు సమాధానం రావడం లేదని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు.
ఆర్టీఐకి కమిషనర్‌లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా సీఎం కేసీఆర్ కుటుంబం రూ. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుందని.. ఈ లీజు అంశంలో అధికార బీఆర్ఎస్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడం ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
Advertisement
Next Story