సానుభూతి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం.. సీఎంకు డీకే అరుణ కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-04-10 13:27:17.0  )
సానుభూతి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం.. సీఎంకు డీకే అరుణ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మండుటెండలో నాయకులు మధ్య పొలిటికల్ పంచులు మరింత పేలుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటోంది. మహబూబ్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ స్థానంలో ఈ ఇరువురి మధ్య రాజకీయ విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం సీఎం రేవంత్ వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ ధ్వజెత్తారు. అందుకోసమే రేవంత్ రెడ్డిపై తాను కుట్ర చేశానని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో చీకట్లో తిరుగుతున్నారని అంటురున్నారని.. చీకట్లో కాదు.. పట్టపగలే తిరుగుతా. కొడంగల్ లో ప్రతి గ్రామంలో తిరుగుతానని నన్నారు. కొడంగల్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఇటీవల మహబూబ్ నగర్ పార్లమెంట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తనపై కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్‌కామెంట్స్‌ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story