Revanth Reddy: చిరంజీవికి ప్రత్యేక అభినందనలు.. సీఎం స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |
Revanth Reddy: చిరంజీవికి ప్రత్యేక అభినందనలు.. సీఎం స్పెషల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హీరో చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు దక్కడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఈ శుభ సందర్భంలో వారికి అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం ట్వీట్ చేశారు. కాగా టాలీవుడ్ ప్రముఖ హీరో, పద్మవిభూషన్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 24 వేల డాన్స్ స్టెప్పులేసి.. అత్యధిక డాన్స్ స్టెప్పులేసిన జాబితాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అంతేగాక ఈ అవార్డ్ దక్కించుకున్న మొదటి నటుడుగా చిరంజీవి రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

Read More...

Chiranjeevi: మెగాస్టార్‌కు అరుదైన ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

Next Story