- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ఇల్లు లేక మరుగుదొడ్లో నివాసం.. మల్లమ్మకు సీఎం రేవంత్ భరోసా
దిశ, డైనమిక్ బ్యూరో: ఇల్లు లేక మరుగుదొడ్లో నివాసం ఉంటున్న ఓ వృద్దురాలికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆమెకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి లో ఏరుళ్ల మల్లమ్మ అనే వృద్దురాలు కడు పేదరికంతో మరుగుదొడ్డిలో నివాసం ఉంటుంది. 20 క్రితం తన భర్త చనిపోవడంతో నానా కష్టాలు పడి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. అనంతరం 15 ఏళ్ల క్రితం శిధిలావస్థలో ఉన్న తన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో అదే స్థలంలో ఓ చిన్న గుడిసె వేసుకుంది.
ఎనిమిదేళ్ల క్రితం అది కూడా పడిపోవడంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రభుత్వం కట్టించిన బాత్‌రూమ్‌లో జీవనం సాగిస్తుంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఇళ్లు కట్టిస్తామని చెప్పిందే తప్ప చేసింది లేదని ఆ వృద్దురాలు వాపోయింది. మల్లమ్మ విషాద గాదపై ఓ మీడియా కథనం ప్రచురించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించి, ఆమెను పరామర్శించడంతో పాటు ఆమె క్షేమం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. అంతేగాక ఆ వృద్దురాలి ఇంటి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.