- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యార్థులకు శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీల అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయం వేదికగా ఆయా శాఖల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు, ధరలు తగ్గించడానికి రెడీ అయినట్లు సమాచారం.
పుస్తకాల తయారీలో 90GSM పేపర్‌కు బదులు 70GSM పేపర్‌ను వాడాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్‌ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్, తెలుగు అంటూ రెండు భాషల్లో ముద్రించడం మూలంగా బరువు, ధరలు కూడా పెరిగాయి. దీంతో పుస్తకాల బరువు, ధరలు తగ్గించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం కోరుతోంది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.