- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమంలో వారిదే కీలక పాత్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికలే కీలకమని.. కార్మికుల సమ్మె సైరన్ ప్రభావంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మీరు.. ఇప్పుడు తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి చారిత్రక అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ విద్యను వ్యాపారం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బొగ్గు గని కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఫైరయ్యారు. ఇప్పటిదాకా ప్రధాని మోడీ నిర్ణయాలన్నింటీకి సీఎం కేసీఆర్ సహకరించాడు.. ఈ తొమ్మిదేళ్లు బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు.. కానీ ఇప్పడు వేరు అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఒరిస్సాలో కోల్‌మైన్‌ను బీజేపీ అదానీకి అమ్మేస్తే కాంగ్రెస్ ఎంపీలమంతా కొట్లాడామని.. కానీ బీఆర్ఎస్ చప్పుడు చేయలేదని ఆరోపించారు.