అక్రమ నిర్మాణాలను అరికట్టాలి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Javid Pasha |   ( Updated:2023-04-12 14:55:43.0  )
అక్రమ నిర్మాణాలను అరికట్టాలి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, అలాగే కేబీఆర్ పార్కు చుట్టూ కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అందుకే వాటి చుట్టూ కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే వచ్చాయని పేర్కొన్నారు.

గ్రీన్ జోన్ లో నిబంధనలు ఉల్లంఘించి భవానాలు కట్టడానికి అనుమతినిచ్చారని అన్నారు. నవాబుల పాత బంగ్లాను కూలగొట్టడానికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిజాం వారసత్వ భవనాన్ని కొనుగోలు చేసి కొత్త భవనం కడుతున్నారని ఆరోపించారు. 5 అంతస్తులు అనుమతినిచ్చిన చోట 21 అంతస్తుల బిల్డింగ్ లు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. క్యాన్సర్ ఆసుపత్రి కూడా 3 అంతస్తులు మించలేదన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలగడానికి ఇలాంటి చర్యలు కారణం కాదా అని ప్రశ్నించారు.

Also Read..

మహేశ్వర్ ​రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ

Advertisement

Next Story